Conrad Sangma : ఫలితాలపై వేచి చూస్తున్నాం – సీఎం
కాన్రాడ్ సంగ్మా షాకింగ్ కామెంట్స్
Conrad Sangma Results : ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు మేఘాలయలో ఉత్కంఠ పోరు కొనసాగుతోంది. వస్తున్న ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ చీఫ్ , సీఎం కాన్రాడ్ సంగ్మా(Conrad Sangma Results). గతంలో ఎన్పీపీ, బీజేపీ కలిసి పోటీ చేశారు. ఎన్నికలకు ముందు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. చివరకు టీఎంసీ చాప కింద నీరులా ఊహించని రీతిలో సీట్లు కైవసం చేసుకుంది. దీంతో టీఎంసీ నిర్ణయాత్మక పాత్రను పోషిస్తోంది.
ఈ మొత్తం ఫలితాలపై సీఎం కాన్రాడ్ సంగ్మా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్పీపీకి మెజారిటీ రావాలంటే ఇంకా కొన్ని సీట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. సంఖ్య తక్కువగా ఉండడంతో ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇక మేఘాలయలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన తర్వాత కాన్రాడ్ సంగ్మా తన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మతో గౌహతిలో సమావేశం అయ్యారు.
భేటీ అనంతరం కాన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ ఎన్నికల్లో మెజారిటీ కోసం పార్టీకి ఇంకా కొన్ని సీట్లు రావాల్సి ఉందన్నారు. నిర్ణయం తీసుకునే ముందు తుది ఫలితాల కోసం వేచి చూస్తామన్నారు(Conrad Sangma Results). మొత్తం 60 సీట్లకు గాను ఒక సీటు వాయిదా వేసింది.
అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి మరణించడంతో వాయిదా వేసింది. మొత్తం 59 సీట్లకు గాను 31 రావాల్సి ఉంది. మ్యాజిక్ ఫిగర్ ఇంకా కొన్ని సీట్లు తక్కువ పడుతున్నాయి. కాంగ్రెస్ , టీఎంసీ పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా గెలుపొందారు. విడి పోయిన బీజేపీ తిరిగి చేరుతుందా అన్నది వేచి చూడాలి.
Also Read : బీజేపీకి షాక్ కాంగ్రెస్ గెలుపు