Conrad Sangma : మేఘాలయ జనం సంగ్మాకే పట్టం
మళ్లీ సీఎం కానున్న కొన్రాడ్ సంగ్మా
Conrad Sangma Meghalaya Result : ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఎన్నికలు ముగిశాయి. త్రిపుర, నాగాలాండ్ లలో బీజేపీ సత్తా చాటింది. ఇక మేఘాలయలో కూడా మరోసారి బీజేపీ నేషనల్ పీపుల్స్ పార్టీతో చేతులు కలపక తప్పలేదు. ఎందుకంటే ఆ పార్టీకి వచ్చిన సీట్లు 2 మాత్రమే. మరో మిత్ర పక్షానికి 11 సీట్లు దక్కాయి. ఇక రాష్ట్రంలో 60 సీట్లకు గాను 26 సీట్లతో ఏకైక అతి పెద్ద పార్టీగా ఎన్పీపీ నిలిచింది. దీనికి చీఫ్ , కర్త, కర్మ, క్రియ అంతా సీఎం కొన్రాడ్ సంగ్మా. ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంచి పట్టుంది.
అందమైన డ్రెస్సులు వేయడం, ఫ్యాషన్ ను ఎక్కువగా ఇష్టపడే కొన్రాడ్ సంగ్మా సీఎం(Conrad Sangma Meghalaya Result) అంటే ఎవరూ నమ్మరు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా ఉండేందుకు ఇష్ట పడతాడు. తాను చెప్పాలని అనుకున్నది ఖండితంగా చెప్పేస్తాడు.
ఇదీ ఆయన ప్రత్యేకత. మేఘాలయకు 12వ సీఎం. మరోసారి అయితే 13వ సీఎం అవుతాడు. జనవరి 27, 1978లో పుట్టాడు. కొన్రాడ్ సంగ్మాకు(Conrad Sangma) 45 ఏళ్లు. తండ్రి దివంగత సీఎం , స్పీకర్ పీఏ సంగ్మా. సోదరుడు జేమ్స్ సంగ్మా. మనోడు ఎంబీఏ చదివాడు. లండర్ లోని ఇంపీరియల్ కాలేజీలో. 2016లో తన తండ్రి మరణించడంతో పార్టీ బాధ్యతలు తన మీద వేసుకున్నాడు.
2008లో మేఘాలయ కేబినెట్ లో అతి చిన్న వయస్సు కలిగిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించాడు. చదువు పూర్తయ్యాక ఎన్సీపీ ప్రచార నిర్వాహకుడిగా ఉననాడు. 2004లో ఓడి పోయాడు. 2008లో తనతో పాటు సోదరుడు కూడా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2009 నుండి 2013 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 2016లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. లోక్ సభ ఉప ఎన్నికలో పోటీ చేశాడు. రికార్డు స్థాయిలో 1.92 లక్షల ఓట్లతో గెలిచాడు. 2018 మార్చి 6న సీఎంగా కొలువు తీరాడు.
Also Read : సీఎం సంగ్మా సక్సెస్ సూపర్ – మోదీ