CM YS Jagan : జ‌గ‌న్ ఫోక‌స్ స‌మ్మిట్ స‌క్సెస్

భారీ ఎత్తున ఒప్పందాలు

CM YS Jagan Summit : ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న స‌త్తా ఏమిటో మ‌రోసారి నిరూపించుకున్నారు. తాను మాట‌ల మ‌నిషిని కాన‌ని చేత‌ల ముఖ్య‌మంత్రిన‌ని స్ప‌ష్టం చేశారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2023ను ఏపీలోని కాబోయే కేపిట‌ల్ సిటీ విశాఖ ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సు రెండు రోజుల పాటు సాగింది. స‌ర్కార్ ఛాలెంజ్ గా తీసుకుంది. 100 దేశాల నుంచి ప్ర‌తినిధులు , 7 దేశాల రాయ‌బారుల‌తో దేశంలోని ప్ర‌ముఖ రంగాల‌కు చెందిన వ్యాపార దిగ్గ‌జాలు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం తీసుకున్న చొర‌వ‌ను, చేసిన కృషిని ప్ర‌త్యేకంగా అభినందించారు. అంతే కాకుండా రాష్ట్రంలో వ‌న‌రుల‌ను గుర్తించ‌డం, వాటిని స‌ద్వినియోగం చేసుకునేలా చేయ‌డంలో సీఎం ఫోక‌స్ పెట్ట‌డం శుభ ప‌రిణామం. ఇప్ప‌టికే విప‌క్షాలు పెద్ద ఎత్తున జ‌గ‌న్ పాల‌న‌ను విమ‌ర్శిస్తున్నారు. ఈ క్లిష్ట స‌మ‌యంలో త‌న ప‌వ‌ర్ ఏమిటో ఆచ‌ర‌ణ‌లో చూపించారు సీఎం(CM YS Jagan Summit) . 352 ఒప్పందాలు ఏకంగా రూ. 13.6 ల‌క్ష‌ల కోట్లు ఏపీకి స‌మ‌కూర‌నున్నాయి. త్వ‌ర‌లోనే ప‌రిశ్ర‌మ‌లు రానున్నాయి. ఈ క్రెడిట్ అంతా జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంది.

దేశీయ పారిశ్రామిక దిగ్గ‌జాలు గ్రంథి మ‌ల్లికార్జున్ రావు, గౌతం అదానీ కొడుకు, ముకేశ్ అంబానీ తో పాటు ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , త‌దిత‌ర రంగాల‌కు చెందిన పారిశ్రామిక‌వేత్త‌లు పాల్గొన్నారు. అంతే కాకుండా ఓడ రేవు క‌లిగిన విశాఖ ప‌ట్ట‌ణానికి ఆరు లేన్ల ర‌హ‌దారిని మంజూరు చేస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. ఇదే స‌మ‌యంలో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ దేశంలో ఏపీ కీల‌క‌మైన పాత్ర పోషిస్తుంద‌ని కితాబు ఇచ్చారు.

Also Read : విశాఖ‌కు నితిన్ గ‌డ్క‌రీ ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!