PM Modi Tour : 12న కర్ణాటకలో మోదీ పర్యటన
ఎన్నికల వేళ పలుమార్లు టూర్
PM Modi Karnataka Tour : కర్ణాటకలో ఎన్నికల వేడి మరింత కేక పుట్టిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీ పవర్ లో ఉంది. మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికల ప్రచారాన్ని ట్రబుల్ షూటర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ప్రారంభించారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కర్ణాటకపై ఫోకస్ పెట్టారు.
తాజాగా ఈశాన్య ప్రాంతంలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. మరోసారి పవర్ లోకి రాగలింది. ఈ విజయం ఇచ్చిన ఊపుతో బీజేపీ కన్నడనాట మరింత జోరు పెంచాలని అనుకుంటోంది. ఇప్పటికే రూ. 16,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది కేంద్రం. ఇప్పటికే ఫాక్స్ కాన్ భారీ ఎత్తున ఐ ఫోన్ల తయారీకి ఓకే చెప్పినట్లు సీఎం బొమ్మై ప్రకటించారు.
దీనిని ధ్రువీకరించారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. అయితే తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఫాక్స్ కాన్ సిఇఓ , చైర్మన్ వెల్లడించడం విశేషం. ఇప్పటికే మోదీ పలుమార్లు కర్ణాటకలో పర్యటించారు.
పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన చేపట్టిన రోడ్ షాకు భారీ ఎత్తున జనాదరణ లభించింది. ఈ మేరకు మార్చి 12న తిరిగి ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ పర్యటించనున్నారు(PM Modi Karnataka Tour).
Also Read : ఫాక్స్ కాన్ ఒప్పందం అబద్దం