PM Modi Attends : ప్రమాణ స్వీకారోత్సవాలకు ప్రధాని
ఈశాన్య రాష్ట్రాలకు 7, 8 తేదీలలో మోదీ హాజరు
PM Modi Attends : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయోత్సవాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా త్రిపుర, నాగాలాండ్ , మేఘాలయ రాష్ట్రాల నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలలో స్వయంగా పీఎం(PM Modi Attends) పాల్గొంటారు. ఈ విషయాన్ని పీఎంఓ కార్యాలయం కూడా ధ్రువీకరించింది. ఇక ఇప్పటికే మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా పీఎం మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా ఆహ్వానించారు. దీంతో 7,8 తేదీలలో రెండు రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించనున్నారు మోదీ.
మార్చి 7న నాగాలాండ్ , మేఘాలయలలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు ప్రధానమంత్రి. ఇక 8న త్రిపురలో జరిగే రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మూడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడ్డాయి. గత నెల ఫిబ్రవరి 16న జరిగిన 60 సీట్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ త్రిపురలోని 55 సీట్లలో 32 సీట్లు గెలుచుకుంది. దాని మిత్ర పక్షమైన ఐపీఎఫ్టీకి ఒక సీటు మిగిలింది.
మార్చి 8న మాణిక్ సాహా చేస్తారా లేక కేంద్ర సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ చేస్తారా అన్నది ఇంకా సస్పెన్ష్ గా ఉంది. ఇక నాగాలాండ్ లో ఎన్డీపీపీ , దాని మిత్రపక్షం బీజేపీ 37 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్డీపీపీ 27 స్థానాల్లో గెలిస్తే బీజేపీ 12 దాంట్లో విజయం సాధించింది.
రాష్ట్రానికి సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన నైపు రియో వరుసగా ఐదోసారి సీఎం కానున్నారు. మేఘాలయలో ఎన్పీపీ 26 సీట్లు గెలుచుకుని టాప్ లో ఉంది. అదే సర్కార్ ఏర్పాటు చేయబోతోంది.
Also Read : త్రిపుర సీఎం రేసులో ప్రతిమా భౌమిక్