Piyush Goyal : రికార్డు స్థాయిలో ఎగుమతులు – గోయల్
$750 బిలియన్ల మేర ఛాన్స్
Piyush Goyal Exports FY23 : కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి భారీ ఎత్తున ఎగుమతులు చేసినట్లు తెలిపారు. గత ఏడాది రికార్డు స్థాయిలో $650 బిలియన్ల ఎగుమతులు సాధిస్తే ఈసారి $750 బిలియన్ల ఎగుమతులకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గత సంవత్సరం వాస్తవానికి రికార్డు అని పేర్కొన్నారు. వస్తువులు, సేవలలో దీనిని సాధించామని స్పష్టం చేశారు. ఈ ఏడాది మరింత పెద్ద రికార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు పీయూష్ గోయెల్(Piyush Goyal Exports FY23) . న్యూఢిల్లీలో జరిగిన రెసీనా డైలాగ్ లో ఆయన పాల్గొన్నారు. 2021-22లో భారత దేశ ఎగుమతులు $676 బిలియన్లు సాధించడం జరిగిందని చెప్పారు కేంద్ర మంత్రి.
అంతర్జాతీయంగా ఎదురుగాలి వీస్తున్నప్పటికీ మార్చి 31 నాటికి భారత వస్తు, సేవల ఎగుమతులు 750 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రికార్డు ఎగుమతులను అధిగమించడం ఖాయమన్నారు. ఇవాళ తమ ప్రభుత్వం స్టార్టప్ లాగా ఆలోచిస్తోందన్నారు పీయూష్ గోయల్. గత ఏడాది సంఖ్యను ఇప్పటికే అధిగమించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ట్రాక్ లోనే ఉన్నామని పేర్కొన్నారు.
రాష్ట్రాలు, ప్రజలు , జిల్లా స్థాయిలలో వ్యాపారాలను భాగస్వామ్యం చేసేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి. ఈ మొత్తం కసరత్తు సుమారు మూడు సంవత్సరాల కిందట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ప్రారంభమైందని తెలిపారు. చాలా శ్రమతో కూడిన పని లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి(Piyush Goyal) .
Also Read : ప్రమాణ స్వీకారోత్సవాలకు ప్రధాని