Manik Sarkar Tripura : త్రిపురలో బీజేపీ హింసోన్మాదం – సీపీఎం
600 కు పైగా హింసాత్మక ఘటనలు
Manik Sarkar Tripura BJP : త్రిపురలో భారతీయ జనతా పార్టీ గెలుపొందాక రాష్ట్రంలో హింస పెచ్చరిల్లి పోయిందని సీపీఎం ఆరోపించింది. ప్రజాస్వామ్యానికి పాతర వేశారని , ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
తాజాగా జరిగిన ఎన్నికల్లో సీపీఎం 11 సీట్లలో గెలుపొందగా కాంగ్రెస్ 3 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక రాష్ట్రంలో 600కు పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని సీపీఎం(Manik Sarkar Tripura BJP) సంచలనలు ఆరోపించింది. త్రిపుర ఎన్నికల్లో మూడో అతి పెద్ద పార్టీగా అవతరించిన సీపీఎం కు చెందిన ముగ్గురు మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారని వాపోయింది.
రబ్బరు తోటలతో సహా పెద్ద సంఖ్యలో ఆస్తులు ధ్వంసం అయ్యాయని మండిపడింది. రెండోసారి బీజేపీ పవర్ లోకి వచ్చాక మరింత పెరిగాయని ఆరోపించింది. త్రిపురలో 668 హింసాత్మక సంఘటనలు జరిగాయని తెలిపింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జితేందద్ర చౌదరి మాజీ మంత్రి తపన్ చక్రవర్తి , లెఫ్ట్ కన్వీనర్ నారాయణ్ కర్ తో కలిసి త్రిపురలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వివరించారు.
2018 మార్చిలో త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భయానక పాలన వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల కారణంగా మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందు వల్ల అది కొన్ని రోజుల పాటు నియంత్రలో ఉందన్నారు. లేక పోతే ఇంకా హింసాత్మక ఘటనలు పెరిగి ఉండేవన్నారు.
మార్చి 2 నుండి వరుస దాడుల కారణంగా మహిళలు, పిల్లలతో సహా వేలాది మంది తమ ఇళ్లను విడిచి పెట్టి పోయారని తెలిపారు. అడవిలో రాష్ట్రం వెలుపల ఆశ్రయం పొందారని ఆరోపించారు.
Also Read : త్రిపుర సీఎం రేసులో ప్రతిమా భౌమిక్