CBI Raids Rabri Devi : మాజీ సీఎం ర‌బ్రీ దేవికి సీబీఐ షాక్

జాబ్స్ కుంభ‌కోణం కేసులో విచార‌ణ

CBI Raids Rabri Devi : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ కోలుకోలేని షాక్ ఇచ్చింది. బీహార్ మాజీ సీఎం ర‌బ్రీ దేవిని(CBI Raids Rabri Devi) సోమవారం త‌న ఇంట్లో ప్ర‌శ్నించింది. భూ స్కాంతో పాటు ఉద్యోగాల కుంభ‌కోణానికి సంబంధించి ఆమెను ప్ర‌శ్నిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆమె త‌న నివాసంలో ఉన్నారు. ఇప్ప‌టికే 9 పార్టీలు కావాల‌ని కేంద్రం టార్గెట్ చేస్తోందంటూ పీఎంకు లేఖ రాసింది. మ‌రో వైపు ఆప్ కు చెందిన మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాను ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి అరెస్ట్ చేసింది.

త్వ‌ర‌లో తెలంగాణ సీఎం కూతురు ఎమ్మెల్సీ క‌విత‌ను కూడా అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. తాము ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని కావాల‌ని సీబీఐ టార్గెట్ చేస్తోందంటూ ఆరోపించారు.

ఇటీవ‌లే మాజీ సీఎం ర‌బ్రీ దేవి కూడా నిప్పులు చెరిగారు. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని పేర్కొన్నారు. ఆ వెంట‌నే సీబీఐ ఎంట‌ర్ కావ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం బీహార్ లో బీజేపీ ప‌వ‌ర్ లో లేదు.

జేడీయూ, ఆర్జేడీ క‌లిపి మ‌హాఘ‌ట్ బంధ‌న్ స‌ర్కార్ ను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండ‌గా మాజీ సీఎం ర‌బ్రీ దేవిని(CBI Raids Rabri Devi) పాట్నా లోని నివాసంలో ప్ర‌శ్నిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో మోసం , భూ కుంభ‌కోణం కేసులో ప్ర‌శ్నిస్తున్న‌ట్లు సీబీఐ స్ప‌ష్టం చేసింది. తాము అరెస్ట్ చేసేందుకు రాలేద‌ని పేర్కొంది. ర‌బ్రీ దేవి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తామ‌ని ఇది దాడులు లేదా సోదాలు కాద‌ని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ స్ప‌ష్టం చేసింది.

Also Read : త్రిపుర‌లో బీజేపీ హింసోన్మాదం – సీపీఎం

Leave A Reply

Your Email Id will not be published!