Arvind Kejriwal Rabri Devi : సీబీఐ సోదాలపై కేజ్రీవాల్ ఫైర్
ఇది పూర్తిగా అప్రజాస్వామికం
Arvind Kejriwal Rabri Devi : భూ, జాబ్స్ స్కాం కేసులకు సంబంధించి సోమవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవికి సీబీఐ. తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే ప్రకటించారు. పాట్నాలోని తన నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ బృందం సోదాలు చేపట్టింది.
దీనిపై సీరియస్ గా స్పందించారు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal Rabri Devi) . ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కేవలం బీజేపీయేతర రాష్ట్రాలు, పార్టీలు, నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అయితే తాము కేవలం వాంగ్మూలం తీసుకుంటామని చెపుతోంది సీబీఐ. ఇంకా కీలక ప్రకటన చేయాల్సి ఉంది. బీహార్ డిప్యూటీ సీఎం మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్ , రబ్రీదేవి ల తనయుడు. ఆయన కూడా సీబీఐ సోదాలపై స్పందించారు.
ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు. తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం కేజ్రీవాల్ కేంద్ర సర్కార్ పై(Arvind Kejriwal) నిప్పులు చెరిగారు. రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. దేశ రాజధాని ఆశ్రమ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆప్ కన్వీనర్ , సీఎం పాల్గొని ప్రసంగించారు.
ఇలా ఎంత కాలం కేంద్ర దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగుతారంటూ ప్రశ్నించారు. తేజస్విపై ఎంత ఒత్తిడి తెస్తే ప్రజలు తిరుగుబాటు చేయడం ఖాయమన్నారు ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్.
Also Read : మాజీ సీఎం రబ్రీ దేవికి సీబీఐ షాక్