Assam CM : బీజేపీ గెలుపులో హిమంత కీలక పాత్ర
ఈశాన్య ప్రాంతంలో పట్టు సాధించిన సీఎం
Assam CM Himanta : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ హాట్ టాపిక్ గా మారారు. తాజాగా ఈశాన్య ప్రాంతంలోని మూడు రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లలో భారతీయ జనతా పార్టీ మరోసారి సత్తా చాటింది.
దీని వెనుక కీలకమైన పాత్ర పోషించారు సీఎం . మేఘాలయలో ఎన్పీపీ చీఫ్ , సీఎం కాన్రాడ్ సంగ్మాతో బీజేపీ విభేదించింది ఎన్నికల కంటే ముందు. కానీ ఈసారి ఎన్నికల్లో 26 స్థానాలు సాధించి ఏకైక పార్టీగా నిలిచింది. బీజేపీకి 2 సీట్లు మాత్రమే వచ్చాయి. కాన్రాడ్ సంగ్మాను తిరిగి బీజేపీతో కలిసేలా చేయడంలో కృషి చేశారు హిమంత బిస్వా శర్మ(Assam CM Himanta).
నాగాలాండ్ లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) , బీజేపీ మధ్య సయోధ్య కుదుర్చడంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీ మూడు స్కోర్లు సాధించింది. నాగాలాండ్ , త్రిపుర, మేఘాలయలలో పార్టీ నైతిక బలాన్ని పెంచడంలో సక్సెస్ అయ్యారు. వ్యూహాలు పన్నడంలో కూడా తనదైన ముద్ర కనబర్చారు సీఎం.
త్రిపురలో సీఎం మార్పు, మేఘాలయలో సంగ్మా ను ఒప్పించడంలో కూడా సక్సెస్ అయ్యారు. ఇక్కడ బీజేపీ 2 సీట్లు గెలుచుకున్నా రాష్ట్రంలోని 59 సీట్లలో అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్పీపీతో కేబినెట్ లో చోటు కల్పించేలా చేశారు హిమంత బిస్వా శర్మ. మార్చి 7, 8న జరిగే ఆయా రాష్ట్రాల ప్రమాణ స్వీకారోవత్సంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు.
ఇక ఇద్దరి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కక పోయినా ఒకరికి మాత్రం కచ్చితంగా కేబినెట్ లో చోటు లభించేలా చేశారు సీఎం. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాయకత్వ మార్పులో మాణిక్ సాహాను తీసుకు రావడంలో హిమంత బిస్వా శర్మ(Assam CM Himanta) కీలక పాత్ర పోషించారు. ఇక మాజీ రాజ వంశస్తుడు ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్ మన్ టిప్రా మోతాతో చర్చల కోసం దారులు తెరిచి ఉంచారు.
Also Read : సీబీఐ సోదాలపై కేజ్రీవాల్ ఫైర్