Suvendu Adhikari Mamatha : దీదీపై సీబీఐ విచార‌ణ చేప‌ట్టాలి

శార‌దా స్కాంపై సువేందు అధికారి

Suvendu Adhikari Mamatha : ప‌శ్చిమ బెంగాల్ భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు సువేందు అధికారి (Suvendu Adhikari) నిప్పులు చెరిగారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎందుకు వెనుకాడుతోందంటూ ప్ర‌శ్నించారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

శార‌దా స్కామ్ లో మ‌మ‌తా బెన‌ర్జీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ద‌శాబ్దాల నాటి శార‌దా చిట్ ఫండ్ కుంభ‌కోణంలో ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్న వారిపై సీబీఐ చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. ఇవాళ సువేందు అధికారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి లేఖ రాశారు. ఆందోళన వ్య‌క్తం చేశారు.

శార‌దా స్కామ్ లో కీల‌క‌మైన పాత్ర టీఎంసీ చీఫ్ , బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి ఉంద‌ని ఆరోపించారు బీజేపీ నేత‌. వ్య‌వ‌స్థ‌లో అత్య‌న్న‌త స్థానంలో ఉన్న వ్య‌క్తిపై సీబీఐ చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. ద‌శాబ్దాల కాలం నాటి నుంచి శార‌దా చిట్ ఫండ్ కుంభ‌కోణంలో ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్న వారిపై సీబీఐ చ‌ర్య‌లు కావాల‌ని తీసుకోవ‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సువేందు అధికారి.

కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణంలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ అత్య‌ధిక ల‌బ్దిదారుగా ఉన్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చ‌స్త్రశారు. ఆమె ప్ర‌స్తుతం సీఎంగా ఉన్నార‌ని , దీంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు సీబీఐ వెనుకాడుతోంద‌ని ఆరోపించారు.

త‌న లేఖ‌లో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది టీఎంసీ. అయితే ప్ర‌స్తుతం సువేందు అధికారి(Suvendu Adhikari Mamatha) చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. లేఖ రాయ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. కాగా టీఎంసీ సువేందుపై సీరియ‌స్ కామెంట్స్ చేసింది.

Also Read : నాకు మెడిటేష‌న్ సెల్ కావాలి – సిసోడియా

Leave A Reply

Your Email Id will not be published!