Conrad K Sangma CM : ప్ర‌ధాని స‌మ‌క్షంలో సంగ్మా ప్ర‌మాణం

మ‌రోసారి సీఎంగా కొలుతీరిన ఎన్పీపీ చీఫ్

Conrad K Sangma CM : ఈశాన్య ప్రాంతంలో కీల‌క‌మైన రాష్ట్రంగా ఉన్న మేఘాల‌య‌కు రెండోసారి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా. మంగ‌ళ‌వారం రాజ్ భ‌వ‌న్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు.

తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్పీపీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భ‌వించింది. కాన్రాడ్ సంగ్మా(Conrad K Sangma CM) సార‌థ్యంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 26 మంది గెలుపొందారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) తొలిసారిగా బ‌రిలోకి దిగింది. 5 సీట్లు కైవ‌సం చేసుకుంది.

137 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ మ‌రో 5 సీట్ల‌తో స‌రి పెట్టుకుంది. ఇద్ద‌రు ఇండిపెండెంట్లు కూడా గెలుపొంది. ఇక ఎన్నిక‌ల కంటే ముందు మేఘాల‌యలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కాన్రాడ్ సంగ్మాతో క‌లిసే ఉన్న‌ది. కానీ ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి జంప్ అయ్యింది. సంగ్మాపై , ఆయ‌న పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఎన్నిక‌ల బ‌రిలో ఒంట‌రిగానే పోటీ చేసింది. కానీ కేవ‌లం 2 సీట్లు మాత్ర‌మే కైవ‌సం చేసుకుంది. చివ‌ర‌కు అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

ఈ మేర‌కు మేఘాల‌య స‌ర్కార్ లో బీజేపీ పాలు పంచుకునేలా చ‌క్రం తిప్పారు. దీంతో బీజేపీకి చెందిన ఇద్ద‌రు స‌భ్యుల‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ఇండిపెండెంట్ల మ‌ద్ద‌తుతో కాన్రాడ్ సంగ్మా(Conrad K Sangma CM) ఇవాళ మేఘాల‌య సీఎంగా ప‌దవీ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న తండ్రి గ‌తంలో సీఎంగా ఉన్నారు. ఇక సంగ్మా లండ‌న్ లో మాస్ట‌ర్స్ చేశారు. మోస్ట్ టెలెంటెడ్ యంగ్ డైన‌మిక్ లీడ‌ర్ గా గుర్తింపు పొందారు.

Also Read : సిసోడియాను ప్ర‌శ్నించ‌నున్న ఈడీ

Leave A Reply

Your Email Id will not be published!