Lalu Prasad Yadav CBI : జాబ్స్ కేసులో లాలూకు సీబీఐ ఝలక్
ఇప్పటికే మాజీ సీఎం రబ్రీదేవి విచారణ
Lalu Prasad Yadav CBI : కేంద్రం వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. భూ, జాబ్స్ స్కాం కేసులో బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రశ్నించింది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాజాగా జాబ్స్ స్కామ్ కేసుకు సంబంధించి ఆనాడు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav CBI) ను మంగళవారం ప్రశ్నించింది. దీని వెనుక ఎవరు ఎన్నారు. ఎంత మంది పాత్ర ఉందనే దానిపై ఆరా తీసింది.
ఇప్పటికే దాణా కేసులో ఇరుక్కుని జైలు లో ఉండి బయటకు వచ్చారు. కేవలం అనారోగ్యం కారణంతో. ఇటీవలే తన కూతురు కిడ్నీ దానం చేయడంతో విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసుకుని సింగపూర్ నుంచి బీహార్ కు చేరుకున్నారు.
ఇదిలా ఉండగా బీహార్ లో బీజేపీ, జేడియూ కలయిక ముగిసింది. దానికి బదులు ఆర్జేడీ, జేడీయూ , కాంగ్రెస్ పార్టీలు కలిసి కొత్తగా రాష్ట్రంలో మహా ఘట్ బంధన్ సర్కార్ ను ఏర్పాటు చేసింది.
ఇదంతా పూర్తిగా కక్ష సాధింపుతో చేస్తున్న చర్యగా ఆరోపించారు బీహార్ డిప్యూటీ సీఎం, లాలూ తనయుడు తేజస్వి యాదవ్. కేసు విచారణలో భాగంగా రబ్రీదేవిపై ప్రశ్నల వర్షం కురిపించింది సీబీఐ. ప్రస్తుతం తేజస్వి, రబ్రీదేవి, లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) పాట్నాలోనే నివసిస్తున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగడం, దాడులు చేపట్టడంతో రాష్ట్రంలో కలకలం రేపింది. దీనిపై సీఎం నితీశ్ కుమార్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం బీజేపీ చెప్పు చేతుల్లో మాత్రమే ఉన్నాయని అవి స్వతంత్రంగా పని చేయడం లేదంటూ 9 మంది ప్రతిపక్ష నాయకులు పీఎంకు లేఖ రాశారు.
Also Read : సెలబ్రిటీలు..ప్రముఖులకు కేంద్రం షాక్