Arvind Kejriwal Modi : మోదీపై భగ్గుమన్న కేజ్రీవాల్
అరెస్ట్ ల తీరు దారుణమని ఆవేదన
Arvind Kejriwal Modi : వరుస అరెస్ట్ లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఆప్ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలు పాలయ్యారు మంత్రి సత్యేంద్ర జైన్. ఆయన అరెస్ట్ అయ్యేంత వరకు ఎలాంటి శాఖ చేపట్టకుండానే మంత్రిగా కొనసాగారు. ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా నెంబర్ 2గా ఉన్నారు. ఆయన ఏకంగా 18 శాఖలకు ప్రాతినిధ్యం వహించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి ఆయన కూడా తీహార్ జైలు బాట పట్టారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకుంది. నేడో రేపో ఆప్ చీఫ్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ మొత్తం వ్యహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిగట్టుకుని బీజేపీయేతర రాష్ట్రాలు, నాయకులను టార్గెట్ చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తొమ్మిది పార్టీలకు చెందిన అధినేతలు , సీఎంలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సుదీర్ఘ లేఖ రాశారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా జరుగుతోందంటూ ఆరోపించారు.
తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. హోలీ రోజు మొత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(Arvind Kejriwal Modi) జ్ఞానోదయం కావాలని తాను పూజలు చేస్తానని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. దేశంలో విద్యా, ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ప్రమాదంలో పడిందన్నారు. కానీ మోదీ దాని గురించి ఆలోచించడం లేదన్నారు.
Also Read : సీబీఐకి లాలూ కూతురు వార్నింగ్