China Warning USA : అమెరికా జర జాగ్రత్త – చైనా
తైవాన్ రెడ్ లైన్ దాటితే జాగ్రత్త
China Warning USA : డ్రాగన్ చైనా నిప్పులు చెరిగింది. అమెరికా తీరుపై మండిపడింది. తైవాన్ విషయంలో రెడ్ లైన్ గనుక దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఒక్క అడుగు లోపలికి వేసినా ఊరుకోబమంటూ మండిపడింది.
ప్రతిసారి తాము అమెరికా తన పరిధి దాట కూడదని చెబుతూ వచ్చామని కానీ కాదని కయ్యానికి కాలు దువ్వితే తీవ్రమైన ప్రతిఘటన తప్పదని పేర్కొంది. ఒకవేళ గనుక రెడ్ లైన్ దాటి వస్తే తాము వాషింగ్టన్ పై నేరుగా దాడికి దిగాల్సిన పరిస్థితి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఇదే సమయంలో యుఎస్ ఇండో – పసిఫిక్ వ్యూహంతో పాటు యుఎస్ , ఇండియా, జపాన్ , ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ గ్రూప్ పై కూడా నిప్పులు చెరిగింది చైనా(China Warning USA) .
అంతే కాకుండా ఆస్ట్రేలియా – యుకె – యుఎస్ కూటమి ఏయుకేయుఎస్ ను లక్ష్యంగా చేసుకున్నామని స్పష్టం చేసింది. చైనా ఆదేశాలను బేఖాతర్ చేస్తూ యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ స్యయంపాలిత ద్వీపాన్ని సందర్శించారు.
తైవాన్ లో యుద్ద వాతావరణం నెలకొంది. భారీగా సైనిక కసరత్తులు జరిపింది. ఇదే సమయంలో ఆగస్టు 4, 2022న పుజియన్ ప్రావిన్స్ లో తైవాన్ నుండి చైనా ప్రధాన భూభాగానికి అత్యంత సమీపంలో పింగ్టాన్ ద్వీపాన్ని దాటి చైనా సైనిక హెలికాప్టర్ ఎగిరింది.
ఇదిలా ఉండగా చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గాంగ్ మంగళవారం అమెరికా తన విదేశాంగ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వాషింగ్టన్ దాటితే బాగుండదని హెచ్చరించారు.
Also Read : శ్రీలంకకు చైనా రుణ సహాయం