MLC Kavitha : బీజేపీని ఢీకొనే స‌త్తా కాంగ్రెస్ కు లేదు

సోనియా గాంధీకి న‌మ‌స్క‌రిస్తున్నా

MLC Kavitha BJP ED : దేశంలో కాంగ్రెస్ పార్టీ ప‌ని ఖ‌త‌మైంద‌ని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు ఆమె. ఈడీ ఈ మేర‌కు నోటీసులు కూడా జారీ చేసింది. మార్చి 10న మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు కోసం దీక్ష చేప‌ట్ట‌నుంది. ఈ సంద‌ర్భంగా గురువారం ఢిల్లీలో క‌విత మీడియాతో మాట్లాడారు.

ప్ర‌స్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు హ‌వా కొన‌సాగిస్తున్నాయ‌ని అన్నారు. 137 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దిక్కు తోచ‌ని స్థితిలో ఉంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఐసీయూలో ఉంద‌ని పేర్కొన్నారు క‌విత‌(MLC Kavitha BJP ED) .

ఆక్టోప‌స్ లా విస్త‌రించిన భార‌తీయ జ‌న‌తా పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ జ‌ట్టుగా ఉండాల‌న్నారు. ప్రాంతీయ శ‌క్తుల‌తో జ‌త క‌ట్టాల‌ని ఆమె పిలుపునిచ్చారు. కేంద్రం రాజ‌కీయంగా ప‌గ బ‌ట్టింద‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీకి భ‌విష్య‌త్తు లేద‌న్నారు. బీజేపీని ఢీకొనే స‌త్తా , ద‌మ్ము ఆ పార్టీకి లేకుండా పోయింద‌న్నారు.

ఇక‌నైనా కాంగ్రెస్ త‌న ఆలోచ‌నా రీతిని మార్చుకోవాల‌ని సూచించారు. అహంకారంతో ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే భ‌విష్య‌త్తులో ఆ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంద‌ని హెచ్చ‌రించారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌(MLC Kavitha). ఇదే స‌మ‌యంలో పార్ల‌మెంట్ లో మ‌హిళా బిల్లును ప్ర‌వేశ పెట్టాల‌ని ఆనాడు సోనియా గాంధీ ప్ర‌య‌త్నం చేశార‌ని ప్ర‌శంసించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు కావాల‌ని ఈడీ ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను, నేత‌ల‌ను టార్గెట్ చేస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల
క‌విత‌.

Also Read : జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద దీక్ష కుద‌ర‌దు

Leave A Reply

Your Email Id will not be published!