MLC Kavitha Deeksha : ముగిసిన దీక్ష రేపే పరీక్ష
పోరాటం ఆపేది లేదన్న కవిత
Kavitha Deeksha : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కోరుతూ భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha Deeksha) చేపట్టిన దీక్ష ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై నాలుగు గంటల దాకా కొనసాగింది. ఆమెకు ఎంపీ కే కేశవరావు నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.
దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలు కవితకు మద్దతు తెలిపాయి. మొదట సీపీఎం నేత సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పోరాటం ఇక్కడితో ముగియ లేదన్నారు. ఇది దేశ వ్యాప్తంగా కొనసాగుతుందని, వివిధ రూపాలలో ఆందోళనలు చేపడతారని స్పష్టం చేశారు.
దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు అవుతున్నా నేటికీ మహిళలకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టక పోవడం దారుణమన్నారు. మోదీ సర్కార్ కావాలని తాత్సారం చేస్తోందంటూ ఆరోపించింది కవిత. డిసెంబర్ లో పార్లమెంట్ సమావేశాలు ముగిసేంత దాకా తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు కల్వకుంట్ల కవిత(Kavitha Deeksha). మహిళా బిల్లు చారిత్రిక అవసరమని దీనిని సాధించి తీరుతామన్నారు. ఆమె దీక్షకు 18 పార్టీలు మద్దతు తెలిపాయి.
కవిత చేపట్టిన దీక్షలో ఎంపీ సంజయ్ సింగ్ అంజుమ్ జావేద్ , సుస్మితా దేవ్ , కేసీ త్యాగి, సీమా మాలిక్ , కె. నారాయణ , పూజా శుక్లా , శ్యామ్ రాజక్ , కపిల్ సిబల్ , ప్రశాంత్ భూషణ్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితకు అసలైన పరీక్ష మార్చి 11న ఎదురు కానుంది. ఆమె విచారణకు రావాలంటూ నోటీసు ఇచ్చింది ఈడీ.
Also Read : 9 జోన్లపై సౌత్ గ్రూప్ పట్టు – ఈడీ