PM Albanese : ఐఐటీల పనితీరు అద్భుతం – ఆల్బనీస్
విద్యా రంగ పరంగా సంస్కరణలు భేష్
PM Albanese : ఏ దేశమైనా ముందుకు సాగాలంటే విద్యా రంగంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్. జి20 గ్రూప్ లో పాల్గొనేందుకు భారత్ లో పర్యటిస్తున్నారు. దేశ ప్రధాని మోదీతో కలిసి ఆల్బనీస్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ ను వీక్షించారు.
అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అంతకు ముందు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో ఆలయాల విధ్వంసం కొనసాగడంపై ఆరా తీశారు. భారతీయ సమాజానికి రక్షణ కల్పించాలని కోరారు.
పీఎం మోదీతో భేటీ అనంతరం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బనీస్(PM Albanese) ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీని సందర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని ఉద్ధేశించి ప్రసంగించారు. జీవితంలో సక్సెస్ కావాలంటే చదువు ముఖ్యమన్నారు. దానిపై ఫోకస్ పెట్టాలని సూచించారు.
తమ ప్రభుత్వం విద్యా పరంగా అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు పీఎం ఆంథోనీ ఆల్బనీస్. ఢిల్లీ శాస్త్రవేత్తలు అభివృద్ది చేస్తున్న అత్యాధునిక సాంకేతికతలను ప్రశంసించారు పీఎం. దేశంలోనే అత్యున్నతమైన ఐఐటీలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఆల్బనీస్.
పీఎం వెంట ప్రధాన కంపెనీలకు చెందిన 20 మందికి పైగా ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు ఉన్నారు. రవాణా, వనరులు, ఆర్థిక, విశ్వ విద్యాలయం, శక్తి, ఆర్కిటెక్చర్ , డిజైన్ , ఆరోగ్యం, వస్తువులు, సమాచార సాంకేతిక రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు ఐఐటీకి.
Also Read : 150 దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ – మన్సుఖ్