Mallikarjun Kharge : ఈడీ దాడులు అప్ర‌జాస్వామికం – ఖ‌ర్గే

లాలూ కుటుంబంపై ఈడీ దాడులు దారుణం

Mallikarjun Kharge ED : ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. బీజేపీయేత‌ర రాష్ట్రాలు, పార్టీలు, నాయకులు, వ్య‌క్తులు, సంస్థ‌ల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తోందంటూ ఆరోపించారు.

కేవ‌లం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే వేధించడం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. లాలూ కుటుంబంపై ఈడీ(Mallikarjun Kharge ED) దాడులు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ నివాసంతో పాటు ఢిల్లీ, రాంచీ, పాట్నా, ముంబై ప్రాంతాల‌లో ఏక కాలంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ దాడుల‌కు దిగింది.

అంత‌కు ముందు భూమి, జాబ్స్ స్కాంలకు సంబంధించి బీహార్ మాజీ సీఎంలు ర‌బ్రీ దేవి, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తో పాటు ప్ర‌స్తుతం స్టేట్ డిప్యూటీ సీఎంగా ఉన్న తేజ‌స్వి యాద‌వ్ 24 ప్రాంతాలలో దాడుల‌కు దిగ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఒక ర‌కంగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు కేంద్ర స‌ర్కార్ కు జేబు సంస్థ‌లుగా మారాయంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఖ‌ర్గే చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. ప్ర‌జాస్వామ్యాన్ని తుంగ‌లో తొక్కుతోందంటూ మండిప‌డ్డారు ఏఐసీసీ చీఫ్‌.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లను దుర్వినియోగం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. తేజ‌స్వి యాద‌వ్ భార్య గ‌ర్భిణీ అని కూడా చూడ‌కుండా ఈడీ సోదాలు చేప‌ట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా ఈడీ(Mallikarjun Kharge ED) దాడుల్లో రూ. 53 ల‌క్ష‌ల న‌గ‌దు యుఎస్ డాల‌ర్లు 1,900, 540 గ్రాముల బంగారం, క‌డ్డీలు, 1.5 కిలోల బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకున్నాయి.

Also Read : బిడ్డ అరెస్ట్ పై సీఎం కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!