MLC Kavitha Security : ఈడీ ముందుకు కవిత భారీ భద్రత
సీరియస్ గా చర్చించిన హరీస్..కేటీఆర్
MLC Kavitha Security : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొద్ది సేపటి కిందట రాజధాని నగరంలోని ఈడీ ఆఫీసుకు బయలు దేరింది. ఈ సందర్భంగా భారీ భద్రతను(MLC Kavitha Security) ఏర్పాటు చేశారు పోలీసులు. విచారణలో భాగంగా కవితకు కేవలం 2 వాహనాలకు మత్రమే పర్మిషన్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. రెండు వాహనాల్లో ఎవరెవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణులు భారీ ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి నుంచి ఈడీ ఆఫీసుకు వెళ్లేందుకు లైన్ క్లియర్ చేశారు. ఏ మాత్రం ఆందోళనలు, నిరసనలు , ధర్నాలు నిర్వహించేందుకు వీలు లేదంటూ ఢిల్లీ పోలీస్ ఆదేశించింది. నినాదాలు ఇచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత కు ధైర్యం చెప్పారు మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు.
కాగా కవిత వెంట ఎవరెవరు వెళతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత కీలకంగా వ్యవహరించిందని స్పష్టం చేసింది. మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, వ్యాపారవేత్త అరుణ రామచంద్ర పిళ్లై బినామీలుగా ఉన్నారని ఈడీ ఆరోపించింది. మొత్తంగా సౌత్ గ్రూప్ కీలకంగా మారిందని, ఇదంతా హైదరాబాద్ కేంద్రంగా స్కెచ్ వేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది.
Also Read : ఈడీ దాడులు అప్రజాస్వామికం – ఖర్గే