Sukesh Chandrasekhar : సిసోడియాకు జైల్లో రాచమర్యాదలు
వివివిఐపీ వార్డులో ఎలా కేటాయిస్తారు
Sukesh Chandrasekhar Letter : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు మనీ లాండరింగ్ కింద అరెస్టైన సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar Letter). వివివిఐపీ కింద సిసోడియాకు ఎలా వార్డును కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి ఒకలా పొలిటికల్ లీడర్లకు మరోలా ఉంటుందా అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు లేఖ రాశారు సుకేష్ చంద్రశేఖర్.
తీహార్ జైలులో సిసోడియాకు అందుతున్న సేవలపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత కొంత కాలంగా ఆప్ పై సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు సుకేష్ చంద్రశేఖర్. ఇక రెలిగేర్ మాజీ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్యను మోసం చేసిన మనీ లాండరింగ్ కేసేఉలో ఇటీవలే అరెస్ట్ అయ్యారు సుకేష్ చంద్రశేఖర్. ఆమ్ ఆద్మీ పార్టీపై , ఆ పార్టీకి చెందిన నేతలపై పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు.
ఇదిలా ఉండగా జైలులో నుండే ట్విట్టర్ వేదికగా స్పందించారు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. జైలు శిక్ష తనకు ఇబ్బందులు కలిగించవచ్చు. తన స్పూర్తిని విచ్ఛిన్నం చేయలేరంటూ పేర్కొన్నారు. నేను లోపట ఉన్నా లేక బయటకు వచ్చినా ప్రజలకు సేవ చేయడం మాత్రం మానుకోను అంటూ స్పష్టం చేశారు. దేశం స్వేచ్ఛ కోసం ఆనాడు స్వాతంత్ర సమర యోధులను కూడా జైలులో పెట్టారంటూ పేర్కొన్నారు సిసోడియా. దీనిపై సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) నిప్పులు చెరిగారు.
Also Read : ఢిల్లీలో బై బై మోదీ పోస్టర్లు