MLC Kavitha ED : కొనసాగుతున్న ఈడీ విచారణ
ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు
MLC Kavitha ED Enquiry : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇప్పటికే ఆమెపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. కోట్ల కొద్ది డబ్బులు సంపాదించిందనే విమర్శలు లేక పోలేదు.
ఇటీవల జరిగిన సంభాషణలో తన చేతికి ఉన్న వాచ్ ఖరీదు రూ. 20 లక్షలు అని చెప్పడంతో తెలంగాణ ఒక్కసారిగా విస్తు పోయింది. ఈ తరుణంలో ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. మార్చి 9న హాజరు కావాల్సిన కవిత మార్చి 11న శనివారం 11 గంటలకు హాజరైంది. ఆమెకు ధైర్యం చెప్పారు సోదరుడు మంత్రి కేటీఆర్ , హరీష్ రావు. ఇవాళ సీఎం కేసీఆర్ భవన్ నుంచి బయలుదేరింది కవిత.
ఆమె వెంట వాహనాలు కూడా బయలు దేరాయి. రెండు వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఇదే సమయంలో తన వెంట భర్త అనిల్ , అడ్వొకేట్ మనోహర్ రావు కూడా వెళ్లారు. సెక్యూరిటీని , భర్తను, అడ్వొకేట్ ను రానివ్వలేదు ఈడీ అధికారులు. కేవలం కవిత ఒక్కరే లోనికి వెళ్లారు. ముందుగా ఎంట్రీ బుక్ లో వివరాలు నమోదు చేశారు కల్వకుంట్ల కవిత(MLC Kavitha ED Enquiry) . మొదటిసారి ఈడీ ముందుకు విచారణకు హాజరు కావడంతో కూల్ చేసినట్లు టాక్.
లిక్కర్ స్కాంకు సంబంధించి ఆరా తీసినట్లు టాక్. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో ఏం జరిగింది. సౌత్ గ్రూప్ కు మీకు ఉన్న బంధం ఏంటి.. వాటాలు ఉన్నాయా లేవా..పిళ్లై ..బుచ్చిబాబు మీకు ఎలా తెలుసు..డబ్బుల లావాదేవీలు ఎలా జరిగాయి..ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారంటూ ఉక్కిరి బిక్కిరి చేసినట్లు సమాచారం. ఎన్ని ఫోన్లు వాడారు..ఎందుకని ధ్వంసం చేశారని ప్రశ్నించినట్లు కూడా టాక్.
Also Read : వాళ్ల ముందు తల వంచ లేదు – లాలూ