Raghav Chadha : దేశంలో బీజేపీ ఒక్కటే ఉండాలా
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కామెంట్స్
Raghav Chadha Slams BJP : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉండాలని అనుకుంటోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తోందంటూ ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ముఖ్యమన్న సంగతి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వాళ్లపై, నిలదీస్తున్న వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారని ఇది ఏ రకమైన డెమోక్రసీ అని నిలదీశారు ఎంపీ .
ఎన్ని కుట్రలు పన్నినా చివరకు ఇటీవల జరిగిన ఢిల్లీ మహానగర కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటిందని గుర్తు చేశారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని వాళ్లను కాదనకుండా ముందుకు వెళ్లడం కష్టమన్నారు.
ఇవాళ దేశంలోని ప్రభుత్వ సంస్థలను నీరు గార్చడమే కాకుండా ప్రతిపక్షాలు అన్నవి లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారని అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసి గొల్పుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రాఘవ్ చద్దా. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను కావాలని తప్పుడు కేసులతో ఇరికిస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని అనుకుంటున్నారంటూ ఆరోపించారు రాఘవ్ చద్దా.
కేవలం మోదీ మాత్రమే ఉండాలని అనుకుంటే కుదరదన్నారు ఎంపీ. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని అందు వల్లనే ఇవాళ అమిత్ షా, మోదీ ఈ స్థాయికి రాగలిగారని పేర్కొన్నారు. దీనిని మరిచి పోయి తానే రాజును అన్నట్టు మోదీ ప్రవర్తిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు రాఘవ్ చద్దా(Raghav Chadha Slams BJP) . ఒకే పార్టీ ఒకే దేశం భారత దేశంలో కుదరదని, ప్రజలు ఛీత్కరించడం ఖాయమన్నారు.
Also Read : బండిపై మహిళా కమిషన్ సీరియస్