Nitesh Rana Resign : ఈడీకి షాక్ నితీష్ రాణా రిజైన్
మోస్ట్ పాపులర్ న్యాయవాది
Nitesh Rana Resign : ఊహించని షాక్ తగిలింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు. గత కొంత కాలం పాటు విశిష్ట సేవలు అందించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా(Nitesh Rana Resign) చేశారు. ఈ మేరకు కీలక ప్రకటన చేయడం విస్తు పోయేలా చేసింది.
ఎన్నో కీలక కేసులకు సంబంధించి ఈడీ తరపున వాదించారు. బ్యాంకులను కొల్లగొట్టి దేశం విడిచి పారి పోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాపై మనీ లాండరింగ్ కేసుల వంటి హై ప్రొఫైల్ విషయాల్లో నితీష్ రాణా ఈడీకి ప్రాతినిధ్యం వహించారు. 2015 నుండి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రాణా అనేక ఉన్నత స్థాయి కేసుల్లో ఫెడరల్ ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించారు.
లష్కరే ఎ తోయిబాకి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫైండింగ్ కేసు వంటి విషయాల్లో ఈడీ తరపున వాదించారు. మనీ లాండరింగ్ విచారణకు సంబంధించిన విచరాణలో యుకె లోని కోర్టులో ఈడికి ప్రాతినిధ్యం వహించాడు నితీష్ రాణా.తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని , కేవలం వ్యక్తిగత కారణాలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవికి న్యాయవాది నితీష్ రాణా రాజీనామా(Nitesh Rana) చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ , ఆర్జేడీ చీఫ్ , బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన కుటుంబం, టీఎంసీ సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ, రాబర్ట్ లతో సహా అనేక ఉన్నతమైన కేసులలో ఫెడరల్ ఏజెన్సీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ అల్లుడు వాద్రా.
లష్కరే తోయిబబా, హిజ్ బుల్ ముజాహిదీన్ లపై జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫైండింగ్ కేసు , హఫీజ్ సయీద్ , సయ్యద్ సలావుద్దీన్ వంటి ఉగ్రవాదులపై కేసుల విషయాలలో ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించాడు.
Also Read : ‘సిలికాన్’ పతనం దేనికి సంకేతం