PM Modi : ప్ర‌జాస్వామ్యాన్ని హేళ‌న చేస్తే ఎలా – మోదీ

రాహుల్ గాంధీపై ప్ర‌ధాని సెటైర్

PM Modi Rahul :  ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సీరియ‌స్ గా స్పందించారు. ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌రోసారి రాహుల్ గాంధీపై విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు. ఆదివారం క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. వంద‌ల కోట్ల ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అంత‌కు ముందు మాంద్యాలో ప్ర‌ధాన మంత్రి మోదీ(PM Modi Rahul)  రోడ్ షో చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన బహిరంగ స‌భ‌లో మోదీ ప్ర‌సంగించారు. కొంద‌రు కావాల‌ని భార‌త దేశాన్ని బ‌ద్నాం చేయాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించారు. ప్రపంచానికి పాఠం నేర్పే స్థితిలో మ‌నం ఉన్నామ‌ని కానీ కొంద‌రు కావాల‌ని ఇక్క‌డ డెమోక్ర‌సీకి ప్ర‌మాదం ఏర్ప‌డిందంటూ ఆరోప‌ణ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. దేశం ప‌ట్ల గౌర‌వం లేని వాళ్లే ఇలా మాట్లాడాతారంటూ ఎద్దేవా చేశారు.

ఎవ‌రు ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా వాటికి ఆధారాలు లేకపోతే ఎలా అన్నారు. వాళ్లు లండ‌న్ కు వెళ్లారు. ఇత‌ర చోట్ల కూడా భార‌త్ ను చుల‌క‌న చేసే ప్ర‌య‌త్నం చేశారు. నీవు నివ‌సిస్తున్న నీ దేశం ప‌ట్ల నీకు గౌర‌వం లేక పోతే ఇత‌రులు నిన్ను ఎలా రెస్పెక్ట్ చేస్తారంటూ మోదీ ప్ర‌శ్నించారు. ఒక ర‌కంగా రాహుల్ గాంధీని(PM Modi Rahul)  ఏకి పారేశారు. ఈ దేశం గొప్ప‌ద‌ని, దీనికి సంబంధించిన సంస్కృతికి వేల ఏండ్ల చ‌రిత్ర ఉంద‌న్నారు.

ఇవాళ నేను భ‌గ‌వాన్ బ‌సవేశ్వ‌రుడి భూమిలో ఉన్నాన‌ని అన్నారు. తాను అదృష్ట‌వంతుడిగా భావిస్తున్న‌ట్లు మోదీ చెప్పారు. యావ‌త్ ప్ర‌పంచం మొత్తం ఈ వ్య‌వ‌స్థ‌ను అధ్య‌య‌నం చేసే ప‌నిలో ప‌డింద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి. భార‌త దేశం అతి పెద్ద ప్ర‌జాస్వామ్యం మాత్ర‌మే కాదు డెమోక్ర‌సీకి త‌ల్లి లాంటిద‌న్నారు మోదీ.

Also Read : రాజ్య‌స‌భ డిప్యూటీ లీడ‌ర్ గా తివారీ

Leave A Reply

Your Email Id will not be published!