Opposition MPS Rally : మోదీ సర్కార్ పై ఎంపీల నిరసన
మోదీ హఠావో దేశ్ కీ బచావో
Opposition MPS Rally : ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు నిప్పులు చెరిగారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతం అదానీకి మధ్య ఉన్న బంధం ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జేపీసీ ఎందుకని ఏర్పాటు చేయలేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో ఆప్ , టీఎంసీ, బీఆర్ఎస్ , డీఎంకే, సీపీఐ, సీపీఎం , తదితర పార్టీలకు చెందిన ఎంపీలు సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్ నుంచి విజయ్ చౌక్ దాకా నిరసన(Opposition MPS Rally) చేపట్టారు. మోదీకి , అదానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని సర్వ నాశనం చేస్తున్న అదానీ గ్రూప్ కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటూ మోదీపై మండిపడ్డారు.
ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ వ్యాపారవేత్తలకు అందలం ఎక్కిస్తున్న ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. దేశంలోని సంస్థలపై పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందని దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.
దేశంలో చట్ట బద్దమైన పాలన కొనసాగడం లేదన్నారు. ఇది పూర్తిగా రాచరిక పాలనలాగా మారిందన్నారు ఎంపీలు.
Also Read : ప్రజాస్వామ్యానికి పాతర మోదీ జాతర