Congress Protest : అదానీ స్కాం మోదీ మౌనం
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన
Congress Protest Adani : గౌతం అదానీ స్కాంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళన(Congress Protest Adani) చేపట్టాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రాజ్ భవన్ వద్దకు పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్ , ఛత్తీస్ గఢ్ ,పంజాబ్ , కర్ణాటక, తదితర రాష్ట్రాలలో నిరసనలు మిన్నంటాయి.
లక్షల కోట్ల ప్రజా ధనం లూటీ అవుతోందని ఆరోపించింది. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రిపోర్ట్ నివేదిక బయట పెట్టాలని , ప్రధానంగా మోదీకి అదానీకి మధ్య ఉన్న లింకు ఏమిటో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజధానిలో పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ఎంపీలు ర్యాలీ చేపట్టారు.
పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ ల ఆధ్వర్యంలో అదానీ స్కాం మోదీ మౌనం పై భగ్గుమన్నాయి. నిలదీసింది కాంగ్రెస్ పార్టీ(Congress Protest) . ఇప్పటికే దేశాన్ని సగానికి పైగా అదానీ పరం చేసిన ఘనత ప్రధానమంత్రికి దక్కుతుందని ఆరోపించారు. అదానీని అరెస్ట్ చేసేంత వరకు తాము ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎన్ని ప్రభుత్వ బ్యాంకులకు కన్నం వేశాడో తెలియాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ లు.
కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనకు మిగతా పార్టీలు కూడా మద్దతు పలికాయి. ప్రస్తుతం పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. చాలా మంది కాంగ్రెస్ నేతలను బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
Also Read : మోదీ అదానీ బంధం బయట పెట్టాలి