Rahul Gandhi Modi : నేను కాదు మోదీ క్షమాపణ చెప్పాలి
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
Rahul Gandhi Over London : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. కేంద్రం తనను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
నేను ఏ నేరం చేశానో చెప్పగలరా అని ప్రశ్నించారు. తాను లండన్ వేదికగా మాట్లాడిన మాటలను సరిగా అర్థం చేసుకోకుండా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Over London) . ఎవరు మతం పేరుతో విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారో తెలియదా అని ప్రశ్నించారు.
తాను రాహుల్ సావర్కర్ ను కాదన్నారు. తాను నిజమైన లౌకిక వాదినని పేర్కొన్నారు. ఈ దేశంలో ప్రస్తుతం బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు.
ఇందులో తప్పేం ఉందని ప్రశ్నించారు. అపారమైన వనరులను కొందరికే దోచి పెడుతూ వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు తెలియకుండా గౌతం అదానీకి కట్టబెట్టినందుకు పీఎం క్షమాపణ చెప్పాలని తాను కాదన్నారు. తన వైపు ఏమైనా తప్పులు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు.
ప్రచార ఆర్భాటం తప్ప దేశం గురించిన సోయి ఏమైనా నరేంద్ర మోదీకి ఉందా అని ప్రశ్నించారు. దేశంలో ఏ వ్యవస్థ సరిగా పని చేయడం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థ దారుణమైన ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. ముందు అదానీతో తనకు ఉన్న సంబంధం ఏమిటో దేశానికి చెప్పాలని సవాల్ విసిరారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
Also Read : రాజస్థాన్ లో హస్తం కమలం స్నేహం