Janasena Party Agenda : జ‌న పక్షం జెండా జ‌న‌సేన ఎజెండా

7 ప్రాథ‌మిక ఆద‌ర్శాలు కీల‌కం

Janasena Party Agenda : ఏపీలో కీల‌కంగా మార‌నున్నారు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. స‌రిగ్గా ఇదే రోజు మార్చి 14, 2014లో ఏర్పాటైంది జ‌న‌సేన. దీనికి వ్య‌వ‌స్థాప‌కుడు, చైర్మన్ ప‌వ‌న్ కళ్యాణ్. పీఏసీ చైర్మ‌న్ గా ఉన్నారు మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్. ఇక ఎన్నో ఉన్న‌త ఆశ‌యాలు, ఆద‌ర్శాలతో జ‌న‌సేన‌ను ఏర్పాటు చేశారు జ‌న‌సేనాని. ఆయ‌న ఇందుకు సంబంధించి ఇజం అని కూడా పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు.

గ‌త కొంత కాలంగా అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో సీట్లు సాధించ‌క పోయినా జ‌న‌సేన నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండేలా చూస్తున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌ధానంగా అవినీతిపై యుద్దం త‌న ప్ర‌ధాన ఎజెండా(Janasena Party Agenda)  అని ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించ‌డమే జ‌న‌సేన పార్టీ కృషి చేస్తుంద‌ని ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌ధానంగా 7 కీల‌క‌మైన ఆద‌ర్శాలను పేర్కొంది పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా.

కులం లేని సామాజిక స్పృహ, మ‌త వివ‌క్ష లేని రాజ‌కీయాలు, భాషా వైవిధ్యం ప‌ట్ల గౌర‌వం, తెలుగు వారి సంప్ర‌దాయాలు, సంస్కృతికి ర‌క్ష‌ణ , ప్రాంతీయ ఆకాంక్ష‌ల‌ను విస్మ‌రించ‌కుండా జాతీయ వాదం, ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు ప్ర‌గ‌తి సాధించేందుకు ల‌క్ష్యంగా జ‌న‌సేన పార్టీ ప‌ని చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఆయ‌న‌కు చేగువేరా అంటే అభిమానం. పార్టీ చిహ్నంగా ఎర్ర‌టి న‌క్ష‌త్రాన్ని ఏర్పాటు చేశారు. 2014లో ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా క‌ల్పించ‌క పోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌స్తుతం టీడీపీ బాస్ చంద్ర‌బాబుతో స‌ఖ్య‌త క‌లిగి ఉన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

Also Read : అంద‌రి చూపు జ‌న‌సేన వైపు

Leave A Reply

Your Email Id will not be published!