MLC Kavitha : 15న మహిళా బిల్లుపై కవిత సమావేశం
వెల్లడించిన భారత జాగృతి సంస్థ
MLC Kavitha Women Quota Bill : మహిళలకు రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు తెలంగాణ సీఎం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha Women Quota Bill) . ఆమె మార్చి 11న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. తిరిగి ఈనెల 16న హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.
తాజాగా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి 15న ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించి భారత జాగృతి సంస్థ. ఈ కీలక సమావేశం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు దేశ రాజధాని లో ని ఓ హోటల్ లో జరగనుంది. కవిత నేతృత్వంలోని భారత జాగృతి సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు , తదితరులతో బీఆర్ఎస్ నాయకురాలు కవిత పాల్గొంటారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించాలని కోరుతూ మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. ఇప్పటికే ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మద్యం స్కాంకు సంబంధించి. కేంద్రం కావాలని తనను ఇరికించేందుకు యత్నిస్తోందని, తన తండ్రిని కార్నర్ చేసేందుకు తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఈడీ ముందు ఆమె హాజరైంది. ఉదయం 11 గంటలకు వెళ్లి రాత్రి 8.05 నిమిషాలకు వచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఏకంగా 9 గంటల పాటు ప్రశ్నించింది. మరో వైపు ఇదే కేసుకు సంబంధించి ఆడిటర్ బుచ్చిబాబు, వ్యాపారవేత్త రామచంద్రన్ పిళ్లైకి నోటీసులు ఇచ్చింది.
Also Read : టీఎస్పీఎస్సీ బోర్డు ధ్వంసం..ఉద్రిక్తం