Mallikarjun Kharge : మోదీ అదానీపై ప్రేమ ఎందుకు
నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే
Mallikarjun Kharge Adani Crisis : దేశంలో నిరంతరం ప్రతిపక్షాలపై దాడులు, సోదాలకు పాల్పడుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై ఫోకస్ పెట్టడం లేదంటూ నిప్పులు చెరిగారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. బుధవారం ఢిల్లీలో 18 ప్రతిపక్ష పార్టీలు ఖర్గే సారథ్యంలో ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నం చేశాయి. దీంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఖాకీలు అనుసరిస్తున్న తీరుపై మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge Adani Crisis) సీరియస్ అయ్యారు. తాము ఉగ్రవాదులం కామని, ఈ దేశం కోసం , ప్రజల డబ్బులను కొల్లగొడుతున్న అదానీ పై విచారణ చేపట్టాలని కోరేందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. అదానీ చేపట్టిన మెగా స్కాం పై విచారణ చేపట్టాలని కోరారు. గతంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరామని, కానీ ప్రధానమంత్రి పట్టించు కోలేదని ఆరోపించారు.
అదానీపై ఉన్న ప్రేమ కారణంగా ఈడీ దాడులు చేయడం లేదా అని ప్రశ్నించాచరు మల్లికార్జున్ ఖర్గే. తాము విచారణ చేపట్టాలని కోరుతూ లేఖ అందజేయాలని భావించాం. కానీ 200 మంది ఉన్న ఎంపీలను అడ్డుకునేందుకు 2,000 మంది పోలీసులు మోహరించారని ఇదేనా మోదీ సర్కార్ చేస్తున్నదంటూ మండిపడ్డారు ఖర్గే.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఎందుకోసమని విచారణకు ఆదేశించడం లేదో దేశ ప్రజలకు చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఏఐసీసీ చీఫ్. ఇవాళ చేపట్టిన ఆందోళనలో మమతా బెనర్జీ పార్టీకి చెందిన టీఎంసీ , శరద్ యాదవ్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పాల్గొనక పోవడం విశేషం.
Also Read : విపక్షాల ఆందోళన ఉద్రిక్తం