RS Praveen Kumar : పరీక్షలు రద్దు చేయక పోతే దీక్ష
48 గంటల గడువు ఇచ్చిన ఆర్సీపీ
RS Praveen Kumar TSPSC Leak : బహుజన సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లీకులు..స్కాంలు..అక్రమాలు..ఆత్మహత్యలకు కేరాఫ్ గా మారిందని ఆరోపించారు. బుధవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) పేపర్ లీక్(RS Praveen Kumar TSPSC Leak) వ్యవహారంపై స్పందించారు.
30 లక్షల మందికి పైగా ఇప్పటి వరకు టీఎస్ పీఎస్సీ లో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ లీక్ వ్యవహారానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది చైర్మన్ జనార్దన్ రెడ్డి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ , సెక్రటరీతో పాటు సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా గతంలో జరిగిన పరీక్షలపై కూడా పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు.
ఇదే సమయంలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). ఇందుకు సంబంధించి 48 గంటల సమయం ఇస్తున్నానని ఆ తర్వాత తాను హైదరాబాద్ లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
చైర్మన్ కు తెలియకుండా ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలని అన్నారు. సిట్ కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ , రాజశేఖర్ రెడ్డి లు ఇద్దరూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులని వారిని ఎవరు నియమించారో, ఎవరి ద్వారా వచ్చారో కూడా తేలాలన్నారు.
Also Read : బీఆర్ఎస్ నేతలపై షర్మిల ఫిర్యాదు