MLC Elections : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవం

ఎమ్మెల్యే కోటాలో దేశిప‌తి, చ‌ల్లా, న‌వీన్ కుమార్

BRS MLC Elections : ఎమ్మెల్యే కోటాలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ముగ్గురు భార‌త రాష్ట్ర స‌మితి(BRS MLC Elections) అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అధికార పార్టీ నుంచి దాఖ‌లు చేసిన దేశిప‌తి శ్రీ‌నివాస్ , చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి, న‌వీన్ కుమార్ ఎన్నికైన‌ట్లు రిట‌ర్నింగ్ అధికారి వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు అందుకున్నారు. ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు గురువారం నాటితో ముగిసింది. ఇత‌ర పార్టీల నుంచి ఎవ‌రూ దాఖ‌లు చేయ‌లేదు. దీంతో వీరి ఎన్నిక‌కు ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది.

దేశిప‌తి శ్రీ‌నివాస్ క‌వి, ర‌చ‌యిత‌, గాయ‌కుడు. తెలంగాణ ఉద్య‌మ స‌మయంలో కీల‌క పాత్ర పోషించారు. సీఎంకు ఓఎస్డీగా ఉన్నారు. ఆనాడు స‌భ‌లు, ర్యాలీల్లో దేశిప‌తి పాల్గొన్నారు. మ‌రో ఎమ్మెల్సీగా ఎన్నికైన న‌వీన్ కుమార్ హైద‌రాబాద్ కు చెందిన వారు. ఆయ‌న తాత రామ‌చంద్ర‌రావు గ‌తంలో మంత్రిగా ప‌ని చేశారు. మేన‌మామ సుద‌ర్శ‌న్ రావు టీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సేవ‌లు అందించారు. విద్యార్థి ద‌శ నుంచే టీఆర్ఎస్ లో కీల‌క పాత్ర పోషించారు.

హైద‌ర్ న‌గ‌ర్ లో స్వంతంగా వేంక‌టేశ్వ‌ర ఆల‌యం నిర్మించారు. 2019 మేలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. తిరిగి మ‌రోసారి ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇక మాజీ రాష్ట్ర‌ప‌తి నీలం సంజీవ‌రెడ్డి మ‌నుమ‌డే చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి. ఆయ‌న స్వ‌స్థ‌లం గ‌ద్వాల జిల్లా పుల్లూరు. ఆలంపూర్ ఎమ్మ‌ల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ కు రిజైన్ చేసి బీఆర్ఎస్(BRS) చేరారు.

ఆ వెంట‌నే ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. త‌మ‌పై న‌మ్మ‌కం ఉంచి ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : సుప్రీంకోర్టుకు క‌విత మ‌రోసారి

Leave A Reply

Your Email Id will not be published!