TDP MLA’s Suspension : స్పీకర్ సీరియస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
వరుసగా రెండోసారి సస్పెన్షన్ల పర్వం
TDP MLAS Suspension : ఏపీలో జరుగుతున్న శాసనసభ సమావేశాలు గందరగోళంగా తయారైంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష టీడీపీకి చెందిన శాసన సభ్యుల మధ్య వాగ్వావాదాలు చోటు చేసుకున్నాయి.
ఇప్పటికే తొలిరోజే బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోబోయిన టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు(TDP MLAS Suspension) వేశారు. శనివారం మరోసారి తెలుగుదేశం పార్టీ సభ్యులు రెచ్చి పోయారు. కాగితాలు చింపి స్పీకర్ తమ్మినేని సీతారాంపై వేశారు. సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చించాలని పట్టు పట్టారు.
దీనిపై చర్చించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. సభలో పెద్ద పెట్టున నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీనిపై వైసీపీ సర్కార్ తీవ్రంగా తప్పు పట్టింది. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన టూర్ల కు సంబంధించి చెప్పాల్సి ఉంటుందన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. సీఎం టూర్ పై వాయిదా తీర్మానం ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు.
కాగితాలు చింపి వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు రాష్ట్ర మంత్రులు. తెలుగుదేశం పార్టీ సభ్యుల దగ్గర సరైన సమాచారం లేదని ఇది కేవలం కావాలని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం తప్ప మరొకటి కాదన్నారు. ఆర్థిక మంత్రి శాసనసభ వ్యవహారాలు కూడా చూస్తున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
రోజూ సభా సమావేశాలను అడ్డుకోవడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. లంచ్ టైమ్ సమయంలోనే వీళ్లు ఆందోళనకు దిగుతున్నారని , ఆ తర్వాత పక్కా విశ్రాంతి తీసుకుని తిరిగి వస్తున్నారంటూ ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టడాన్ని తప్పు పట్టారు.
Also Read : పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలుపు