MLC Kavitha Appear : ఉత్కంఠకు తెర దించిన కవిత
ఎలాంటి హంగు ఆర్భాటం లేదు
MLC Kavitha Appear : నిన్నటి దాకా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ ముందు విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు తెర పడింది. ఆమె తనంతకు తానుగా సోమవారం ఉదయం 10.30 గంటలకు ముందుగానే చేరుకోవడం విస్తు పోయేలా చేసింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. లిక్కర్ స్కాంలో ఇప్పటి దాకా 34 మందిపై అభియోగాలు మోపితే 11 మందిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది. ఆయన తీహార్ జైలులో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సౌత్ గ్రూప్ కీలకమని ఇప్పటికే ఈడీ పేర్కొంది. ప్రత్యేక కోర్టులో సమర్పించిన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇది కలకలం రేపింది. ఈ మొత్తం లిక్కర్ దందా వెనుక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha Appear) ఉందని నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే 10 సెల్ ఫోన్లను ధ్వంసం చేయడం, చాట్ , ఇందులో పాల్గొన్న వారందరిని గుర్తించింది.
ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు గతంలో తనకు ఆడిటర్ గా ఉన్న సీఏ గోరంట్ల బుచ్చిబాబుతో పాటు వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లైని కలిపి విచారించనున్నట్లు సమాచారం. ఈనెల 11న విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). ఆమెను ఈడీ 9 గంటల పాటు విచారించింది.
మార్చి 16న తిరిగి రావాలని నోటీసు ఇచ్చింది. ఆరోజు హై డ్రామా చోటు చేసుకుంది. తాను హాజరు కాలేనంటూ పేర్కొంది. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేక పోయింది. మార్చి 20న హాజరు కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది ఈడీ. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కవిత హాజరు కావడం విస్తు పోయేలా చేసింది.
Also Read : ఈడీ విచారణకు హాజరైన కవిత