Adani Rahul Row : పార్లమెంట్ లో గందరగోళం
కొనసాగుతున్న వాయిదాల పర్వం
Adani Rahul Row : అదానీ హిండెన్ బర్గ్ వివాదం, రాహుల్ గాంధీ(Rahul Row) డెమోక్రసీ పై చేసిన కామెంట్స్ పై మరోసారి పార్లమెంట్ దద్దర్లిల్లింది. ప్రతిపక్ష పార్టీలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి. బడ్జెట్ సెషన్ రెండో సగం నిరంతరం ఆటంకాలు , వాయిదాలను చూసింది. చోటు చేసుకున్న ప్రతిష్టంభన మధ్య పార్టీల నాయకులతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ చర్చలు జరిపారు.
పార్లమెంట్ లో గందర గోళానికి ముగింపు పలికేందుకు లోక్ సభ స్పీకర్ సోమవారం అన్ని పార్టీలతో విడివిడిగా చర్చలు జరిపారు. ఉభయ సభలు అంతరాయం లేకుండా కార్యకలాపాలు నిర్వహించాలని కోరారు. కేంద్ర బడ్జెట్ , ఆర్థిక బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అదానీ హిండెన్ బర్గ్ సమస్యపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేయాలన్న తమ డిమాండ్ నుండి దృష్టి మరల్చేందుకు బీజేపీ నేతృత్వంలోని సర్కార్ కావాలని అడ్డుకుంటోదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
లండన్ లో రాహుల్ గాంధీ(Adani Rahul Row) చేసిన వ్యాఖ్యలను సాకుగా ఉపయోగించు కుందని ప్రతిపక్షాలు ఆరోపించారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని , దీనికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్రం తెలిపింది. రాహుల్ గాంధీ ముందు దేశానికి క్షమాపణలు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది.
ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై లోక్ సభలో సమాధానం ఇస్తానని చెప్పారు. పార్లమెంట్ వెలుపల కూడా ముందుగా క్షమాపణ చెబితే తప్ప మాట్లాడనిచ్చే ప్రసక్తి లేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : టీపీసీసీ చీఫ్ కు సిట్ బిగ్ షాక్