SKM Demands : కేంద్రానికి రైతున్న‌ల అల్టిమేటం

కేంద్ర మంత్రిని క‌లిసి విన‌తి ప‌త్రం

SKM Demands : త‌మ న్యాయ ప‌ర‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్క్ఎం)(SKM Demands) ఆధ్వ‌ర్యంలో రైతు నాయ‌కులు సోమవారం కేంద్ర వ్య‌వసాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ ను క‌లిశారు. ప్ర‌భుత్వం గ‌నుక త‌మ డిమాండ్ల‌ను నెరవేర్చ‌క పోతే మ‌రోసారి ఆందోళ‌న‌కు దిగుతామ‌ని హెచ్చ‌రించారు.

15 మంది స‌భ్యుల‌తో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా బృందం తోమ‌ర్ కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించింది. ఈ విష‌యాన్ని రైతు నేత ద‌ర్శ‌న్ పాల్ వెల్ల‌డించారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని, రుణాలు మాఫీ చేయాల‌ని, పెన్ష‌న్ చ‌ట్టంతో స‌హా త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కోరారు. లేక పోతే నిర‌స‌న‌కు దిగుతామ‌ని చెప్పామ‌న్నారు. అప‌రిష్కృతంగా అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లుమార్లు కేంద్రాన్ని కోరాం. 

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ లేద‌న్నారు ద‌ర్శ‌న్ పాల్. తాము ఏప్రిల్ 30న ఢిల్లీలో మ‌రో స‌మావేశాన్ని ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. అన్ని రైతు సంఘాలు(SKM Demands) త‌మ త‌మ రాష్ట్రాల‌లో ర్యాలీలు చేడ‌తామ‌ని చెప్పారు. స‌మావేశానికి ముందు పంచాయ‌తీలు నిర్వహించాల‌ని సూచించారు.

ర‌మీలా మైదానంలో స‌మావేశ‌మైన రైతుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు ద‌ర్శ‌న్ పాల్. పంట‌ల బీమా , రైతుల‌పై న‌మోదైన కేసులను ఇంత వ‌ర‌కు ఉప‌సంహ‌రించు కోలేద‌ని ఆరోపించారు. కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి అజ‌య్ మిశ్రాను బ‌ర్త‌ర్ చేసి జైల్లో పెట్టాల‌ని డిమాండ్ చేశారు. రైతుల‌కు విద్యుత్ రాయితీల‌ను విద్యుత్ చ‌ట్టం నుంచి మిన‌హాయించామ‌ని ఈ సంద‌ర్భంగా పాల్ కు కేంద్ర మంత్రి తోమ‌ర్ తెలిపారు.

Also Read : అవినీతికి కేరాఫ్ క‌ర్ణాట‌క స‌ర్కార్

Leave A Reply

Your Email Id will not be published!