TSPSC Paper Leak : సీడీపీఓ..ఈవో పరీక్షలు రద్దు చేయాలి
నిరుద్యోగులు, అభ్యర్థుల ఆందోళన
TSPSC Paper Leak Row : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా తయారైంది. ప్రతి రోజూ టీఎస్ పీఎస్సీ ఎదుట విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. గతంలో నిర్వహించిన పరీక్షలను కూడా రద్దు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది(TSPSC Paper Leak Row). ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా తమకు న్యాయం జరగదని అభ్యర్థులు వాపోతున్నారు. సీబీఐతో విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ , బీఎస్పీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీకి చెందిన అధ్యక్షులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
ఈ లీకుల వ్యవహారం పూర్తిగా కేసీఆర్ ఫ్యామిలీ కనుసన్నలలోనే జరిగిందని ఆరోపించారు. అంతే కాకుండా వెంటనే చైర్మన్ గా ఉన్న బి. జనార్దన్ రెడ్డిని తప్పించాలని కోరారు. మరో వైపు ఆధారాలు బయటకు రాకుండా ఉండేలా ఒత్తిడి తెస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. సోమవారం ఉస్మానియా యూనివర్శిటీ ఆద్వర్యంలోని వివిధ సంఘాల విద్యార్థి నేతలు, స్టూడెంట్స్ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
నిందితుడు రాజశేఖర్ రెడ్డి తల్లి సీడీపీఓలో పని చేస్తోందని ఇందుకు సంబంధించి సీడీపీఓ, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టులను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసిన టీఎస్ పీఎస్సీ చైర్మన్ సీడీపీవో, ఈవో పరీక్షలను కూడా రద్దు(TSPSC Paper Leak) చేయాలని కోరారు. ఇన్ని పరీక్షలు లీక్ అయినప్పుడు అవి లీక్ కాకుండా ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా నిరసన కారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Also Read : ఢిల్లీలో టెన్షన్ టెన్షన్