Bandi Sanjay SIT : ఆధారాలు ఇవ్వాలని బండి సంజయ్‌కి మళ్లీ సిట్ నోటీస్
Bandi Sanjay SIT : తెలంగాణలో గ్రూప్ 1 సహా కొన్ని పేపర్ల లీకేజీపై దర్యాప్తు చేస్తున్న సిట్ (SIT) అధికారులు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటికి వెళ్లి.. రెండోసారి నోటీస్ ఇచ్చారు(Bandi Sanjay SIT.
రద్దయిన గ్రూప్ 1 పరీక్షలో సిరిసిల్ల ప్రాంతం వారికే ఎక్కువగా వందకు పైగా మార్కులు వచ్చాయని బండి సంజయ్ ఈమధ్య కామెంట్స్ చేశారు. అందుకు ఆధారాలు సమర్పించాలంటూ సిట్ అధికారులు సీఆర్పీసీ సెక్షన్ 91 కింద నోటీస్ ఇచ్చారు. రేపు తమ ముందు హాజరై ఆధారాలు ఇవ్వాలని కోరారు.
సిట్ అధికారులు ఇటీవలే మొదటిసారి నోటీస్ ఇచ్చారు. 24న తమ ముందు హాజరు కావాలని కోరారు. కానీ బండి సంజయ్ నిన్న సిట్ అధికారుల దగ్గరకు వెళ్లలేదు. తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందువల్ల తాను రాలేకపోయానని బండి సంజయ్ చెప్పడంతో.. ఇవాళ మరోసారి నోటీస్ ఇచ్చారు సిట్ అధికారులు.
సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం లేదంటున్నారు బండి సంజయ్(Bandi Sanjay). సిట్ అధికారులకు తాను ఆధారాలు ఇచ్చేది లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరపాలన్నది బండి సంజయ్ డిమాండ్. మరోవైపు పేపర్ లీకేజ్ అంశంపై ఇవాళ ఇందిరా పార్కులో బీజేపీ .. మహా ధర్నా చేపట్టింది. ఇందులో భారీ సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొంటున్నారు.
కాగా .. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ రేణుక సహా 9 మందిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా రమేష్, సురేష్ తో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇక తాజాగా మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు.ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 13కు చేరింది.
Also Read : పేపర్ లీక్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్..!