CM Jagan G20 : జీ-20 ప్రతినిధులకి సీఎం జగన్ అదిరిపోయే విందు

మౌలిక వసతులు పై కృషి

CM Jagan G20 : విశాఖ మహానగరంలో జరుగుతున్న జీ20 ప్రతినిధులకు అదిరిపోయే విందు ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. దేశ, విదేశ ఈ డెలిగేట్స్ ముందు ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ ఆలోచన, లక్ష్యం అన్నారు.

విశాఖ వేదికగా జీ20 సమ్మిట్ సందడిగా సాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan).. విశాఖలో గడిపే ప్రతి సమయం, ప్రతి క్షణం చెరిగిపోని జ్ఞాపకంలా మిగిలిపోతుందన్నారు. సాగర నగరం ప్రతి ఒక్కరికీ మధురమైన అనుభూతిని మిగుల్చుతుందని అన్నారు. ఈ సమ్మిట్ కు హాజరైన ప్రతినిధులకు మర్యాదపూర్వకంగా అదిరిపోయే విందు అందించారు.

జీ 20 సమ్మిట్ లో డెలిగేట్స్ ముందు ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ ఆలోచన, లక్ష్యం అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. అలాగే 22లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామంటూ వివరించారు. ఒక్కోచోట పెద్దపెద్ద టౌన్‌షిప్‌లు, ఊళ్లే నిర్మాణమవుతున్నాయని జీ-20 (CM Jagan G20) డెలిగేట్స్‌ దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే ఈ గృహ సముదాయాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. దీనికి సబంధించి అందరి సలహాలు, సూచనలు కోరుతున్నాను అన్నారు జగన్. మీ ఆలోచనలు అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. జీ-20 సదస్సులో చర్చించండి-సలహాలు, సూచనలు ఇవ్వండి అంటూ ప్రతినిధులను కోరారు.

సస్టెయిన్‌బుల్‌ పాలసీలతో సరైన మార్గనిర్దేశకత్వం చేయగలిగితే పేదలకు ఇళ్లు సమకూరతాయన్నారు. జీ-20 సమ్మిట్‌లో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ IWG సమావేశాలు జరుగుతున్నాయ్‌. మంగళవారం మొదలైన ఈ సమావేశాలు మరో మూడ్రోజులపాటు సాగనున్నాయ్‌. వన్‌ ఎర్త్‌-వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఫ్యూచర్‌ థీమ్‌తో అనేక సమస్యలపై చర్చించబోతున్నారు ప్రతినిధులు.

అంతకుముందు జీ 20 సదస్సు సందర్భంగా విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. గన్నవరం నుంచి ఆయన రాత్రి 7.05 గంటలకు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి జీ 20 సదస్సు జరుగుతున్న రాడిసన్‌ బ్లూ హోటల్‌కు సీఎం చేరుకున్నారు.

Also Read : రేపు హైదరాబాద్ లో వైన్ షాపులు, బార్లు బంద్

Leave A Reply

Your Email Id will not be published!