TS Govt Farmers : ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్

TS Govt Farmers : రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వానాకాలం సీజన్ లో ఏకంగా 50 లక్షల టన్నుల ధాన్యాన్ని సర్కార్ కొనుగోలు చేసింది. ఈ ధాన్యం విలువ దాదాపు రూ.9,600 కోట్లు. అయితే ఈ యాసంగి పంట కూడా మరికొద్ది రోజుల్లోనే రానుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రతీ ఏటా కూడా ప్రభుత్వం (ఐకేపీ) కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల దగ్గరి నుండి పంటను కొనుగోలు చేస్తుంది. ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 21న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. కాగా దీనికి సంబంధించిన కార్యాచరణపై ఏప్రిల్ 10న పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్, ఆర్ధిక మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ కానున్నారు.

ఈ భేటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల స్థలాల ఏర్పాటు, గన్నీ బ్యాగుల సేకరణ, ట్రాన్స్ పోర్టుకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సీజన్ లో 56.45 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. మొత్తం 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు.

ఈ అంచనాల మేరకు గన్నీ బ్యాగుల సేకరణ, మిల్లులతో ఒప్పందం సహా కీలక విషయాలను ఏప్రిల్ 10న చర్చించనున్నారు. కాగా పంట కొనుగోలు చేయాలన్న సర్కార్ నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో భారీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ..!

Leave A Reply

Your Email Id will not be published!