Siddaramaiah Modi : పీఎం ఎన్నికల కోడ్ ఉల్లంఘన
మాజీ సీఎం సిద్దరామయ్య ఫైర్
Siddaramaiah Modi : కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై(PM Modi) నిప్పులు చెరిగారు. ఏప్రిల్ 9న మూడు రోజుల మెగా ఈవెంట్ ను మోదీ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఈ తరుణంలో మాజీ సీఎం సీరియస్ గా స్పందించారు. ఇది పూర్తిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించారు. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం తేదీని ఖరారు చేసింది.
ఈ సందర్భంగా సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎలా సందర్శిస్తారంటూ ప్రశ్నించారు. ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ ను దాటడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పీఎంను ఎలా అనుమతి ఇచ్చిందనే విషయాన్ని తాము ఎన్నికల సంఘానికి తెలియ చేస్తామన్నారు మాజీ సీఎం.
మార్చి 29 నుంచి అమల్లోకి వచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు తర్వాత ప్రధానమంత్రి పర్యటించనుండడ్ం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. మరో వైపు వరుణ, కోలార్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే సంకల్పాన్ని సిద్దరామయ్య(Siddaramaiah Modi) వ్యక్తం చేశారు. ఇంకా నియోజకవర్గాలు ఖరారు కాలేదు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్.
సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వీరిద్దరి వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వాపోయారు.
Also Read : భారత్ కు చేరుకున్న భూటాన్ రాజు