Rahul Gandhi : ధ‌ర్మం గెలుస్తుంది నీతి నిలుస్తుంది

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ

Rahul Gandhi Court Bail : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. త‌న‌పై వేటు వేయ‌డం, ప‌రువు న‌ష్టం దావా కేసులో జైలు శిక్ష విధించ‌డం , త‌దిత‌ర ప్ర‌ధాన అంశాల‌పై తీవ్రంగా స్పందించారు. ఈ దేశం కోసం తాను ప్రాణ త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. తాను చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర దేశంలో క‌ల‌క‌లం రేపింద‌న్నారు.

తాను అంద‌రూ క‌లిసి ఉండాల‌ని కోరుకునే నాయ‌కుడిని అని స్ప‌ష్టం చేశారు. మ‌తం పేరుతో, కులం పేరుతో, విద్వేషాల పేరుతో రాజ‌కీయాలు చేయ‌డం లేద‌న్నారు రాహుల్ గాంధీ. సోమ‌వారం గుజ‌రాత్ లోని సూర‌త్ కోర్టుకు రాహుల్ గాంధీ(Rahul Gandhi Court Bail)  త‌న సోద‌రి ప్రియాంక గాంధీతో క‌లిసి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. రాహుల్ గాంధీని చూసేందుకు వారంతా అక్క‌డికి చేరుకున్నారు. వారికి రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ అభివాదం చేశారు. ప‌రువు న‌ష్టం కేసులో త‌న‌కు శిక్ష విధించ‌డాన్ని స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ దేశంలో ఎంద‌రో నాయ‌కులు ఎన్నో మాట‌లు అన్నారు.

కానీ వారి గురించి ప‌ట్టించు కోలేద‌ని ప్ర‌శ్నించారు. కానీ తాను ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తంగా నిందించ‌డం లేద‌న్నారు. కేవ‌లం స‌మ‌స్య‌ల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావిస్తున్నాన‌ని ఇది ఒక భార‌తీయుడిగా, నాయ‌కుడిగా త‌న బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇదే స‌మ‌యంలో ధ‌ర్మం ఎప్ప‌టికీ గెలుస్తుంద‌ని, నీతి నిలుస్తుంద‌ని ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు.

Also Read : రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు

Leave A Reply

Your Email Id will not be published!