Rahul Gandhi : సత్యమే నా ఆయుధం – రాహుల్ గాంధీ
దేశం కోసం ప్రాణం ఉన్నంత దాకా పోరాటం
Rahul Gandhi : నేను ఎవరికీ భయపడను. ఎందుకంటే నేను తప్పు చేయను. ఎవరికీ తల వంచను. ధర్మ పోరాటంలో న్యాయమే గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది. దీనినే నేను విశ్వసిస్తానని స్పష్టం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. పరువు నష్టం దావా కేసులో సోమవారం గుజరాత్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్ల జైలు శిక్షను వాయిదా వేసింది. ఏప్రిల్ 13న తిరిగి ఈ కేసుకు సంబంధించి విచారణ జరపనుంది.
కోర్టు నుంచి బయటకు వచ్చిన రాహుల్ గాంధీ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. సత్యమే నా ఆయుధమని దానిని అంతిమంగా తన శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు పొరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. కొన్ని శక్తులు కావాలని ఇబ్బందులు కలుగ చేస్తున్నాయి. అది పలు రూపాలలో వ్యక్తం అవుతూనే ఉన్నదని అన్నారు. ఆయన మరోసారి ప్రజాస్వామ్యం గురించి కామెంట్ చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దానిని కాపాడేందుకే తాను పోరాటం చేస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పారు.
సత్యమే నా ఆయుధం సత్యమే నా శరణ్యం అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడం వల్ల ఆయన పార్లమెంట్ కు అనర్హత వేటు పడింది. శిక్షను రద్దు చేయకుంటే 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉండదు. తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయడం ప్రారంభించాడు రాహుల్ గాంధీ.
Also Read : న్యాయ వ్యవస్థను బెదిరిస్తున్న కాంగ్రెస్