Akunuri Murali : కేసీఆర్ ఎన్నికల ఖర్చుపై ఆకునూరి ఫైర్
దాచుకో దోచుకో కల్వకుంట్ల కుటుంబం నైజం
Akunuri Murali : సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ సీఎం కేసీఆర్ పై చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. 2024లో దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల తరపున తనను చైర్మన్ ను చేస్తే ఎన్నికలకు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానంటూ సీఎం చెప్పారంటూ బాంబు పేల్చాడు.
దీనిపై ప్రతిపక్షాలు, ప్రజాస్వామిక వాదులు, రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా పరిగణించారు. తెలంగాణ పేరుతో అవినీతి, అక్రమాలకు పాల్పడడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ , మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సీఎం కేసీఆర్ పై, ఆయన కుటుంబంపై నిప్పులు చెరిగారు. గత 9 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బులు 14,42,481 కోట్లు అని పేర్కొన్నారు. ఇందులో వచ్చిన కమీషన్ వల్లే కేసీఆర్ ఇలాంటి ప్రకటన చేశాడంటూ ఆరోపించారు ఆకునూరి మురళి(Akunuri Murali). భూ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్టర్ల మాఫియా , విద్యా మాఫియా, ఆరోగ్య మాఫియాగా తెలంగాణను మార్చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న అవినీతిపై సీబీఐ, ఈడీ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆకునూరి మురళి.
Also Read : విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్