YS Sharmila : రాజ‌కీయాల‌కు అతీతంగా పోరాడుదాం

పిలుపునిచ్చిన వైఎస్ ష‌ర్మిల

YS Sharmila : రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంది. నీళ్లు, నిధులు, నియామ‌కాల కోసం ఏర్ప‌డిన తెలంగాణ ప్రాంతం ఇవాళ ఒకే ఒక్క కుటుంబానికి ప‌రిమిత పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మల‌(YS Sharmila). బుధ‌వారం బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. హైద‌రాబాద్ పార్టీ ఆఫీసులో జ‌రిగిన స‌మావేశంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు వైఎస్ ష‌ర్మిల‌.

రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల‌కు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేయ‌లేదు. తాము మొద‌టి నుంచీ పార్టీ పెట్ట‌క ముందు నుంచీ నిరుద్యోగుల కోసం పోరాటం చేశామ‌ని అన్నారు వైఎస్ ష‌ర్మిల‌. అంతే కాకుండా జెండాలు, అజెండాలు ప‌క్క‌న పెట్టి క‌లిసి క‌ట్టుగా ముందుకు రావాల‌ని తాను కోరాన‌ని తెలిపారు.

ఇందులో భాగంగానే తాను తెలంగాణ జ‌న స‌మితి పార్టీ చీఫ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ను క‌లిసి విన్న‌వించాన‌ని, ఆయ‌న కూడా సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు. ఎవ‌రు వ‌చ్చినా రాకున్నా వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల ప‌క్షాన పోరాడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఉద్య‌మంలో అరెస్ట్ లు చేసినా నిర్బంధించినా వెన‌క్కి త‌గ్గేది లేదంటూ హెచ్చ‌రించారు ష‌ర్మిల‌(YS Sharmila).

Also Read : బండి అరెస్ట్ పై సోము సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!