Supriya Shrinate : చరిత్ర మిమ్మల్ని క్షమించదు
సుప్రియా శ్రీనాటే కామెంట్స్
Supriya Shrinate : ఎన్సీఆర్టీ పుస్తకాలలో వాస్తవాలకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ దేశం కోసం తన ప్రాణాలను కోల్పోయిన మహాత్మా గాంధీ గురించి , ఆయనను పొట్టన పెట్టుకున్న ఆర్ఎస్ఎస్ కు చెందిన నాథురాం గాడ్సే ప్రస్తావన లేకుండా చేయడం దారుణమన్నారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సుప్రియా శ్రీనాటే(Supriya Shrinate).
ఇది పూర్తిగా చరిత్రను పిల్లలకు తెలియకుండా చేయడంలో భాగమేనని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నిషేధం, గుజరాత్ లో చోటు చేసుకున్న అల్లర్లు , ఇలాంటి వాటిని లేకుండా చేయడం కుట్రలో భాగమేనని ఆరోపించారు.
పాఠ్య పుస్తకాలలోంచి బీజేపీ ప్రభుత్వం పనిగట్టుకుని పాఠాలను , లేదా అందుకు సంబంధించిన అంశాలను తొలగించగలరు. కానీ వాస్తవానికి చరిత్రను ప్రజలు ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుంటారని స్పష్టం చేశారు.
అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికని, కానీ ఉన్న చరిత్రను చెరపడం కాదని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. గుజరాత్ అల్లర్లలో ఎవరు నష్ట పోయారో ఈ దేశానికి తెలుసన్నారు. మతం పేరుతో విద్వేషాలు రాజేస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్న బీజేపీకి పాఠాలను తొలగించే హక్కు లేదన్నారు.
ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహాత్ముడు దేశం కోసం చేసిన బలిదానం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేవలం మతం ఆధారంగా ఈ దేశానికి స్వేచ్చ లభించ లేదని గుర్తించాలన్నారు సుప్రియా శ్రీనాటే(Supriya Shrinate).
Also Read : మోదీజీ చరిత్రను చెరప లేరు – ఖర్గే