Congress Selection : అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
పాల్గొన్న డీకే శివకుమార్, సిద్దరామయ్య
Congress Selection : కర్ణాటకలో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పవర్ లో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. ఈసారి అధికారం చేజిక్కించు కోవాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే విషయంపై సమాలోచనలు మొదలు పెట్టాయి.
బుధవారం కాంగ్రెస్ పార్టీకి(Congress Selection) సంబంధించి రాష్ట్ర ఇంఛార్జ్ రణదీప్ సూర్జేవాలాతో పాటు ఇతర సీనియర్లతో కలిసి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ , మాజీ సీఎం సిద్దరామయయ్య ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా స్క్రీనింగ్ కమిటీ మల్లగుల్లాలు పడుతోంది. ఎవరికి టికెట్లు కేటాయించాలనే దానిపై కసరత్తు కొనసాగుతోంది.
ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు రణ్ దీప్ సూర్జేవాలా. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీకి చెందిన సీనియర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఆ పార్టీకి అభ్యర్థులే లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read : మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు