Pawan Khera : సింధియాకు అంత సీన్ లేదు
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
Pawan Khera : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ మీడియా, ప్రచార కమిటీ చైర్మన్ పవన్ ఖేరా(Pawan Khera) నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న విధానాలు సరైనవి కావన్నారు. ఇవాళ కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా తమ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై, తమ పార్టీపై నోరు పారేసు కోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
పదవుల కోసం పార్టీలు మార్చే వారికి తమను అనే నైతిక హక్కు లేదన్నారు. ఎవరు ఎవరి పంచన చేరారో ప్రజలకు తెలుసన్నారు. అధికారం కోసం అర్రులు చాచే మనస్తత్వం ఉండడం వల్లనే సింధియా మోదీ వంత పాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ సంస్థలను అప్పనంగా అమ్ముకుంటూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది ఎవరో చెప్పాలన్నారు. అదానీ విషయంలో ప్రధాన మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందన్నారు.
అందుకే తాము డెమోక్రసీని రక్షించు కోవాలని పోరాడుతున్నామని స్పష్టం చేశారు పవన్ ఖేరా(Pawan Khera). బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు గోడల మధ్య ఉన్న సింధియాకు అంత సీన్ లేదన్నారు.
ఇవాళ తమ చరిత్ర మాత్రమే ఉండాలని, తాము మాత్రమే అధికారంలో కొనసాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు కంటున్నారు. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఇది చెల్లుబాటు కాదని తెలుసు కోవాలన్నారు.
Also Read : విపక్షాలకు షాక్ పిటిషన్ తిరస్కరణ