Jagarmath Mahto : జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి ఇక లేరు
చెన్నైలో చికిత్స పొందుతూ మృతి
Jagarmath Mahto : జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి జాగర్నాత్ మహ్తో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం హేమంత్ సోరేన్ తీవ్ర సంతాపం తెలిపారు. గొప్ప పోరాట యోధుడిని, నిబద్దత కలిగిన రాజకీయ నేతను తాము కోల్పోయాని కన్నీటి పర్యంతం అయ్యారు.
జగర్నాథ్ మహ్తో(Jagarmath Mahto) లేని లోటు పూడ్చ లేనిదంటూ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఆయన గతంలో కరోనాకు గురయ్యారు. ఆ తర్వాత శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. ఇటీవల మరోసారి వైద్య చికిత్స కోసమని చెన్నైకి వెళ్లారు. నవంబర్ 2020లో ఊపిరి తిత్తుల మార్పిడి చేయించుకున్నారు. అంతా బాగానే ఉందని అనుకున్న సమయంలో ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
దీంతో గత నెలలో జగర్నాథ్ మహ్తోకు మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక విమానంలో చెన్నై ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ ఇవాళ కన్ను మూశారు. దీంతో రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంచెలంచెలుగా మంత్రి స్థాయి వరకు ఎదిగారు. ఇవాళ ఆయన లేరన్న వార్తను జీర్ణించు కోలేక పోతోంది రాష్ట్రం.
Also Read : మోదీ 24 గంటల రాజకీయ నేత – ఆజాద్